Home    Membership    Events/News    Market Place    Literary Club    Youth Corner    Yellow Pages    Discussion Forum    About DTA  
            You are at Home > DTLC
       
Featured Ads

DR.Madhavi Yerneni D.M.D.
Ruchi Restaurant
Dr. Reshma Gowda DDS
Tecra Systems
Eric Messner (College & Retirement Planning)
)
Priya Restaurant
Joe Tebben (Loan Officer)
DR.Deepthi Lingam M.D.
Lotus Bank
Home and Commercial Loan
 DTLC Calendar
 Decennial Conference
 Decennial Brochure
 My Literature
 About DTLC
 

DTLC Decennial Conference & Celebrations  (Register Now)

   

 

Can't see Telugu script? Download the details in PDF format

డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ దశవార్షికోత్సవ సమావేశాలు

కేవలం తెలుగు పుస్తకాలు చదివి, వాటి గురించి మాట్లాడుకోవడం కోసం ఏర్పాటు చేసుకున్న ఈ డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ పదేళ్ళపాటు ఇలా నిర్విఘ్నంగా, నిర్విరామంగా కొనసాగుతుందని ఊహించలేదు. నిజానికి ఈ సమావేశాలు 1998లో మొదలైనప్పుడు ఏదో నలుగురైదుగురం అప్పుడప్పుడూ కలుస్తుండేవాళ్ళం. అయితే, త్వరలోనే ఒక సంస్థగా ఏర్పడి సుమారు ఆరు వారాలకొకసారి కలుస్తూ, చదివిన తెలుగు పుస్తకాలపై చర్చిస్తూ, డిట్రాయిట్‌కు వచ్చిన తెలుగు సాహితీవేత్తలతో సమావేశాలేర్పాటు చేసుకుంటూ, వీలైనంతలో పుస్తకాలు ప్రచురిస్తూ, పదేళ్ళపాటు మనగలగటం ఈ సంస్థ నిరాడంబరమైన ఆశయాలకు, ఈ ప్రాంతపు తెలుగువారి సాహిత్యాభిమానానికి నిదర్శనం. ఈ డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ (లేదా డిట్రాయిట్ తెలుగు సాహితీ సమాఖ్య) పదో ఏట అడుగు పెట్టిన సందర్భానికి గుర్తుగా సెప్టెంబరు 20, 21 తేదీల్లో తెలుగులో సాహిత్య విమర్శ పై రెండు రోజులపాటు సదస్సులు నిర్వహిస్తున్నాం. అన్ని కళలతోపాటు సాహిత్యానికి కూడా వన్నె తెచ్చేది తన మన భేదాలు పాటించని సద్విమర్శే. అలాంటి విమర్శ తెలుగు సాహిత్యంలో ఎంతవరకూ జరుగుతోందో, ఎలా ఉండాలో తెలుసుకోవడానికి చేసే ప్రయత్నమే ఈ సదస్సుల ముఖ్యోద్దేశం. ఈ సదస్సుల్లో పాల్గొనడానికి, ఉపన్యసించి చర్చించడానికి అమెరికా నలు మూలల నుండి, జర్మనీ నుండి, ఆంధ్రప్రదేశ్ నుండి సాహిత్యాభిమానులు ఎంతో ఉత్సాహంతో వ్యయప్రయాసలకోర్చి మరీ వస్తున్నారు. వీరిలో ఒకరిద్దరు తెలుగు సాహిత్యంలో విశేషంగా కృషి చేసిన వారైనా, అందరూ తెలుగు పుస్తకం చదవడమే ప్రవృత్తిగాగలవాళ్ళు. ఈ సదస్సుల్లో పాల్గొనడానికి ఎలాంటి ప్రత్యేక అర్హతా, రుసుమూ కూడా అవసరం లేదు. భోజన వసతితో సహా సమావేశాలు, శనివారం (సెప్టెంబరు 20) సాయంత్రం జరిగే విందు, వినోద కార్యక్రమాలు కూడా (డిట్రాయిట్ తెలుగు అసోసియేషన్ సహకారంతో) తెలుగు సాహిత్యాభిమానులకు ఉచితమే. పైగా డిట్రాయిట్‌కు దూర ప్రాంతాలనుండి వచ్చే సాహిత్యాభిమానులకు వీలైనంతలో ఆ రెండు రోజులూ సభ్యుల ఇళ్ళలో గృహ వసతి కూడా ఏర్పాటు చెయ్యడానికి ప్రయత్నిస్తాం. ఐతే మేము తగిన ఏర్పాట్లు చేసుకోవడనికిగాను వచ్చేవారు మాకు సెప్టెంబరు 1వ తేదీ లోగా తెలియజేయాలి. వీలైనంత త్వరలో రిజిష్టరు చెయ్యండి. మీరు రిజిష్టరు చెయ్యడానికి వీలుగా క్రింద లింకు ఉంది. విందు, వినోద కార్యక్రమాల్లో ప్రత్యేకతగా స్వీయ రచనా పఠనం కూడా ఉంటుంది. స్వీయ రచనా పఠనం చెయ్యదల్చుకున్నవారు సెప్టెంబరు 10 లోగా తెలియజేయాలి. అన్ని వివరాలకు detroittelugu@comcast.net కు ఈమెయిల్ చెయ్యండి. మా ఆహ్వానాన్ని మన్నించి తెలుగు సాహిత్యాభిమానులందరు రావాలని కోరుతున్నాం, వస్తారని ఆశిస్తున్నాం.

సదస్సులో పాల్గొనడానికి రిజిష్టరు చెయ్యడానికి ఆఖరు తేదీ: సెప్టెంబరు 1, 2008 (ఎంత త్వరగా ఐతే అంత మంచిది)
స్వీయ రచనా పఠనం చెయ్యగోరువారు తెలుపవలసిన తేదీ: సెప్టెంబరు 10, 2008
సదస్సులు జరిగే సమయం: సెప్టెంబరు 20, శనివారం, ఉదయం 9 గంటల నుండి సెప్టెంబరు 21, ఆదివారం, మధ్యాహ్నం 3 గంటల వరకు.


   
  Can't see Telugu script? Download the details in PDF format

Register Now

Program in a nutshell


 
   
 

 

 

 

     
  Contact Us © Detroit Telugu Association. All rights reserved. Powered By Tecra Systems. Inc